టైమ్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
Sakshi Education
టైమ్ ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాలు-100 జాబితాలో భారత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోహో హౌస్‌లకు చోటు లభించింది.
ఈ జాబితాను ఆగస్టు 22న టైమ్ మేగజీన్ విడుదల చేసింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్‌లోని కేవడియాలో నర్మదా నది నడిబొడ్డున ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్‌లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోహో హౌస్‌కు చోటు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : టైమ్ మేగజీన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోహో హౌస్‌కు చోటు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : టైమ్ మేగజీన్
Published date : 23 Aug 2019 05:51PM