Skip to main content

టాటా స్టీల్ చెస్ టోర్నీ చాంపియన్‌గా కార్ల్‌సన్

టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు.
Current Affairsపశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నిలో మొత్తం 27 పాయింట్లతో కార్ల్‌సన్ అగ్రస్థానాన్ని అలంకరించాడు. కార్ల్‌సన్‌కు 37,500 డాలర్లు (రూ. 26 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 23 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 18.5 పాయింట్లతో సో వెస్లీ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్‌‌స) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... సో వెస్లీకి మూడో స్థానం, అనీశ్‌కు నాలుగో స్థానం లభించాయి. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగమైన ఈ టోర్నీలో పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తొలుత ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత బ్లిట్జ్ విభాగంలో పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో ఓవరాల్ చాంపియన్
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మాగ్నస్ కార్ల్‌సన్
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
Published date : 27 Nov 2019 05:45PM

Photo Stories