టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన మహిళ?
Sakshi Education
ఆఫ్రికా దేశమైన టాంజానియాకు కొత్త అధ్యక్షురాలిగా సమియా సులుహు హసన్ నియమితులయ్యారు.
మార్చి 19న టాంజానియాలోని దారెస్సలాంలో అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన 61 ఏళ్ల సమియా ఆ పదవిని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. హిజాబ్ ధరించి, ఖురాన్ చేతబట్టి, చీఫ్ జస్టిస్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు ముందుగా పని చేసిన అధ్యక్షుడు జాన్ మగుఫులి గుండెపోటుతో కన్నుమూయడంతో అధ్యక్ష నియామకం తప్పనిసరైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : సమియా సులుహు
ఎక్కడ : దారెస్సలాం, టాంజానియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాంజానియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : సమియా సులుహు
ఎక్కడ : దారెస్సలాం, టాంజానియా
Published date : 23 Mar 2021 11:36AM