Skip to main content

తాలిబన్ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోమని ప్రకటించిన సంస్థ?

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా తేల్చిచెప్పేసింది.

 ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్‌ స్పష్టంచేసింది. ఈ మేరకు ఆగస్టు 19న ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఎంఎఫ్‌ వెల్లడించింది.

విదేశాల్లో రూ.66,600 కోట్లున్నాయి
ప్రస్తుతం తమ దేశంలో నగదు నిల్వలు ఏవీ లేవని అఫ్గానిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అజ్మల్‌ అహ్మదీ చెప్పారు. అయితే విదేశాల్లో మాత్రం 9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.66,600 కోట్లు) ఉన్నాయని తెలిపారు. 9 బిలియన్‌ డాలర్లలో 7 బిలియన్‌ డాలర్లు అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్లు, బంగారం, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : తాలిబన్‌ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోమని ప్రకటించిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)
ఎందుకు : తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే...

Published date : 20 Aug 2021 06:00PM

Photo Stories