తాలిబన్ చెర నుంచి భారతీయుల విడుదల
Sakshi Education
గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు అక్టోబర్ 7న విడుదల చేశారు.
అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి అయిన జల్మే ఖలిల్జాద్ ఇస్లామాబాద్‌లో తాలిబన్ నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ముగ్గురు భారతీయ బందీలను తాలిబన్లు విడుదల చేశారు. ఇందుకు ప్రతిగా అఫ్గాన్ జైళ్లలో ఉన్న 11 మంది ముఖ్య నాయకులను తాలిబన్లు విడిపించుకున్నారు. అయితే ఈ పరిణామాలపై అఫ్గాన్ ప్రభుత్వం నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు.
2018 మే నెలలో అఫ్గానిస్తాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్‌లో ఓ పవర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజనీర్లను, వారి డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడుగురిలో ఒకరిని 2019, మార్చిలో విడుదల చేశారు.

Published date : 09 Oct 2019 06:03PM