సయ్యద్ మోదీ ఓపెన్ టోర్ని రన్నరప్‌గా సౌరభ్
Sakshi Education
సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డిసెంబర్ 1న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్(మధ్యప్రదేశ్) 15-21, 17-21తో ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. విజేత వాంగ్ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్ సౌరభ్ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2019 ఏడాది సౌరభ్ హైదరాబాద్ ఓపెన్, వియత్నాం ఓపెన్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు.
వాంగ్ జు వె నెగ్గడంతో... 2014 తర్వాత సయ్యద్ మోదీ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్ లభించినట్లయింది. 2014లో జుయ్ సాంగ్ (చైనా) విజేతగా నిలువగా... 2015లో పారుపల్లి కశ్యప్ (భారత్), 2016లో కిడాంబి శ్రీకాంత్ (భారత్), 2017, 2018లలో సమీర్ వర్మ (భారత్) చాంపియన్స్ గా నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో రన్నరప్
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సౌరభ్ వర్మ
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్

Published date : 02 Dec 2019 05:46PM