స్వదేశం చేరుకున్న అభినందన్
Sakshi Education
శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు.
పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను మార్చి 1న అట్టారీ-వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్-21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వదేశం చేరుకున్న భారత వైమానిక దళ పైలట్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : అభినందన్ వర్థమాన్
ఎక్కడ : అట్టారీ-వాఘా సరిహద్దు
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వదేశం చేరుకున్న భారత వైమానిక దళ పైలట్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : అభినందన్ వర్థమాన్
ఎక్కడ : అట్టారీ-వాఘా సరిహద్దు
Published date : 02 Mar 2019 05:24PM