స్వదేశీ టెక్నాలజీతో తొలి తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసిన సంస్థ?
Sakshi Education
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తొలి దేశీయ తాత్కాలిక వారధిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయం(పూణే, మహారాష్ట్ర)లో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని డిసెంబర్ 30న భారత సైన్యానికి అందజేశారు. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది.
పలు ప్రైవేట్ కంపెనీలు సహకారం అందించడంతోనే ఈ తాత్కాలిక వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్‌డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్‌లతో దీన్ని రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వదేశీ టెక్నాలజీతో తొలి తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసిన సంస్థ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎందుకు : అత్యవసర పరిస్థితుల్లో వాగులు, వంకల వంటి అడ్డంకులను భారత ఆర్మీ వేగంగా దాటేందుకు

Published date : 31 Dec 2020 06:09PM