స్వచ్ఛతా అభియాన్ యాప్ ప్రారంభం
ఈ యాప్‌ను డిసెంబర్ 24న న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్ చంద్ గహ్లోత్ ప్రారంభించారు.
రెండో దశ స్వచ్ఛ భారత్ ప్రారంభం...
రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణం) ప్రారంభమైంది. న్యూఢిల్లీలో 2020, మార్చి 4న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. రూ.1,40,881 కోట్లతో చేపట్టిన రెండో దశ మిషన్‌ను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేస్తారు. రెండో దశ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపడతారు.
చదవండి: స్వచ్ఛ భారత్-2 విశేషాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛత అభియాన్అనే మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్ చంద్ గహ్లోత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పరిశుభ్రంగా లేని మరుగుదొడ్లు, మాన్యువల్ స్కావెంజర్ల సమాచారం గుర్తించడానికి, జియో ట్యాగ్ చేయడానికి