Skip to main content

స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ప్రారంభం

దేశాన్ని ఓడీఎఫ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2019’ను కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ఆగస్టు 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
దేశంలోని సుమారు 700 జిల్లాల్లోని 17వేల గ్రామాల్లో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించనున్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ద్వారా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా (ఓడీఎఫ్‌గా) మార్చే దిశగా ముందడుగు వేశామని మంత్రి షేకావత్ తెలిపారు. 2018లో నిర్వహించిన మొదటి దఫా సర్వేను దేశవ్యాప్తంగా ఉన్న 6వేల గ్రామాల్లో నిర్వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సర్వేక్షణ్ గ్రామీణ్-2019 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశాన్ని ఓడీఎఫ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా
Published date : 15 Aug 2019 05:19PM

Photo Stories