Skip to main content

స్వాతంత్య్ర సమరయోధుడు పిళ్లా రామారావు కన్నుమూత

స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, భారతీయ విద్యా కేంద్రం (బీవీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు పిళ్లా రామారావు (95) విశాఖపట్నంలోని చినవాల్తేర్‌లో ఫిబ్రవరి 3న కన్నుమూశారు.
పిళ్లా సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులకు 1924లో జన్మించిన రామారావు విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందించారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివిన ఆయన ఏవీఎన్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1958లో భారతీయ విద్యా కేంద్రం (బీవీకే)ని స్థాపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో 1942లో చేరి అదే ఏడాది స్వాతంత్య్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో విశాఖ కేంద్ర కారాగారంలో 18 నెలలు జైలు శిక్ష (మీసా) అనుభవించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : పిళ్లా రామారావు (95)
ఎక్కడ : చినవాల్తేర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 04 Feb 2019 06:20PM

Photo Stories