షూటింగ్‌లో చండేలా ప్రపంచ రికార్డు
Sakshi Education
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 23న మొదలైన షూటింగ్ టోర్నమెంట్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫెనల్లో 26 ఏళ్ల చండేలా 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో చండేలా 252.4 పాయింట్లతో 2018, ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ టోర్నీలో రుజు జావో 251.8 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గగా... హాంగ్ జు (చైనా-230.4 పాయింట్లు) కాంస్యం కై వసం చేసుకుంది. 2015లో కొరియాలో జరిగిన ఈవెంట్‌లో కాంస్యం నె గ్గిన చండేలా అదే ఏడాది వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో రజతం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : అపూర్వి చండేలా
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : అపూర్వి చండేలా
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 25 Feb 2019 05:36PM