Skip to main content

సూర్యుడి ఉపరితల ఛాయచిత్రాలు విడుదల

అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్త ‘ద ఐనోయీ సోలార్ టెలిస్కోపు’తో తీసిన సూర్యుడి ఉపరితలం ఛాయాచిత్రాలను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ జనవరి 30న విడుదల చేసింది.
Current Affairsసూర్యుడికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకెల్లా ఇవే అత్యంత స్పష్టమైనవి. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఐనోయీ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. ఈ విషయమై సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా మాట్లాడుతూ.. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు.

సౌర తుపానులు..
సూర్యుడిపై ఏర్పడే సౌర తుపానులు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. జీపీఎస్ వంటి వ్యవస్థలను నాశనం చేసేందుకు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను దెబ్బతీసేందుకు సౌర తుపానులు కారణమవుతాయని కోర్డోవా పేర్కొన్నారు. ప్రస్తుతం సౌర తుపానులు ఏర్పడేందుకు 48 నిమిషాల ముందు మాత్రమే మనకు తెలుస్తోంది. కొత్త టెలిస్కోపు సాయంతో 48 గంటల ముందుగానే తెలుసుకోవచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సూర్యుడి ఉపరితల ఛాయచిత్రాలు విడుదల
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్
Published date : 31 Jan 2020 05:40PM

Photo Stories