Skip to main content

సుప్రీంకోర్టులో బ్రిటన్ అత్యున్నత న్యాయమూర్తి

బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ ఫిబ్రవరి 24న భారత సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
Current Affairsఅంతర్జాతీయ న్యాయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన లార్డ్ జాన్ రీడ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేతోపాటు 15 నిమిషాలపాటు ధర్మాసనంపై కూర్చొని కోర్టు వ్యవహారాలను పరిశీలించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆయన్ను కోర్టు హాల్‌లోకి ఆహ్వానించారు.
 
 మానవ హక్కులపై దాడులు: ఐరాస 
 ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులపై దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని ఆపేందుకు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీలతోపాటు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు.
Published date : 25 Feb 2020 05:54PM

Photo Stories