సుప్రీంకోర్టుకు సామాజిక మాధ్యమాల పిటిషన్లు
Sakshi Education
ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించడంపై వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయి.
ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో రెండు, బోంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం అక్టోబర్ 22న విచారణ జరిపింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నిరోధించడంపై చర్యలకు సంబంధించి 2020, జనవరి 15వ తేదీలోగా ఒక నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
Published date : 23 Oct 2019 06:00PM