సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామస్వామి కన్నుమూత
Sakshi Education
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) హైదరాబాద్‌లో మార్చి 6న కన్నుమూశారు.
1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు. 1981-82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రామస్వామి నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులైన ఆయన 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : జస్టిస్ కె.రామస్వామి (87)
ఎక్కడ : హైదరాబాద్

Published date : 07 Mar 2019 05:51PM