సుప్రీంకోర్టు జడ్జీలుగా దినేశ్, సంజీవ్ కు పదోన్నతి
Sakshi Education
సుప్రీంకోర్టు జడ్జీలుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.
ఈ మేరకు జనవరి 10న కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు జడ్జీలుగా దినేశ్ మహేశ్వరి,జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు జడ్జీలుగా దినేశ్ మహేశ్వరి,జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం
Published date : 14 Jan 2019 04:48PM