Skip to main content

సుముద్ర మట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు

మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
సుముద్ర మట్టాలు పెరగడం వల్ల జపాన్, చైనా, బంగ్లాదేశ్ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050నాటికి 300మిలియన్ల మంది ప్రజలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సుకు హాజరైన గుటెరస్ అక్కడి విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 4న ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ‘క్లైమేట్ సెంట్రల్’ అనే సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి ‘నేచర్ కమ్యూనికేషన్స్’ పేరుతో ఇటీవల ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి ‘హై టైడ్ లైన్’ కిందకు కుంగే ప్రమాదముంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలో చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Published date : 05 Nov 2019 05:41PM

Photo Stories