Skip to main content

సులభతర వాణిజ్యంలో ఏపీకి అగ్రస్థానం

సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఈ మేరకు వర్సిటీకి చెందిన ఆసియా కాంపిటీటివ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్(ఏసీఐ) కో- డెరైక్టర్ టాన్ ఖీ జియాప్ జనవరి 3న ఒక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటిస్థానంలో ఉండగా మహారాష్ట్ర, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణ 9వ స్థానంలో ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం
ఎక్కడ : దేశంలో
Published date : 04 Jan 2019 05:47PM

Photo Stories