Skip to main content

సుదర్శన్ పట్నాయక్‌కు ఇటాలియన్ గోల్డెన్ అవార్డ్

భారత్‌కి చెందిన చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్ఠాత్మక ‘ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019’కు ఎంపికయ్యారు.
2019, నవంబర్ 13 నుంచి 18 వరకు ఇటలీలో నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ స్కోరా నా శాండ్ నేటివిటీ’ కార్యక్రమంలో పట్నాయక్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పట్నాయక్ నేతృత్వం వహించనున్నారు. సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019కు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్
Published date : 04 Nov 2019 05:45PM

Photo Stories