శత్రుదేశాల డ్రోన్‌లను బంధించే ప్రహరీ డ్రోన్
Sakshi Education
దేశంలోకి చొరబడిన శత్రుదేశాల డ్రోన్‌లను బంధించేందుకు ఐఐటీ-కాన్పూర్ విద్యార్థులు ‘ప్రహరీ’ అనే సరికొత్త డ్రోన్‌ను రూపొందించారు.
ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ డ్రోన్ సరిహద్దు నిఘాకు, సాయుధ దళాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఐఐటీ-కాన్పూర్ ఏరోస్పేస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌లు అభిషేక్, మంగళ్ కొఠారీ, విద్యార్థుల బృందం ఈ డ్రోన్‌ను రూపొందించారు.
నాలుగు నుంచి ఐదు కేజీల బరువును మోయగలిగే ప్రహరీ డ్రోన్ చిన్న సైజు హెలికాప్టర్‌లా ఉంటుంది. దీనికి ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారు మూడు గంటల పాటు గస్తీ కాయగలదు. ఆ సమయంలో శత్రు దేశాల డ్రోన్‌లు కనపడితే వెంటనే వాటికంటే పైకి ఎగిరి వల విసురుతుంది. ఆ డ్రోన్‌లను బంధిస్తుంది. ఈ డ్రోన్‌లు విడిపించుకోవడానికి ప్రయత్నించినా, అకస్మాత్తుగా తమ బరువును పెంచుకున్నా తట్టుకొని వాటిని పట్టి తెస్తుంది. ప్రహరీ డ్రోన్‌ను విపత్తుల సమయంలో, అత్యవసర సేవలు, వ్యవసాయంలోనూ ఉపయోగించవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రహరీ డ్రోన్ రూపకల్పన
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఐఐటీ-కాన్పూర్ విద్యార్థులు
ఎందుకు : శత్రుదేశాల డ్రోన్‌లను బంధించేందుకు

Published date : 26 Nov 2019 05:49PM