Skip to main content

స్టిరియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్?

స్టిరియన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌<strong> </strong>వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.
Current Affairs
ఆస్ట్రియాలోని స్పీల్‌బర్గ్‌లో జూన్‌ 27న జరిగిన రేసులో ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 22 నిమిషాల 18.925 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), బొటాస్‌ (మెర్సిడెస్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలువగా... రెడ్‌బుల్‌ జట్టు మరో డ్రైవర్‌ పెరెజ్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లో ఎనిమిది రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్‌ 156 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 4న జరుగుతుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : స్టిరియన్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌?
ఎప్పుడు : జూన్‌ 27
ఎవరు : రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌
ఎక్కడ : స్పీల్‌బర్గ్, ఆస్ట్రియా
Published date : 28 Jun 2021 06:15PM

Photo Stories