స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన భారతీయుడు?
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్మూలనకు కృషి చేస్తున్న ‘‘స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్ బోర్డు’’ చైర్మన్‌గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎన్నికయ్యారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సంస్థకు హర్షవర్ధన్ 2021, జూలై నుంచి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని బోర్డ్ ఆఫ్ స్టాప్ టీబీ పార్ట్‌నర్ షిప్ తెలిపింది. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి నిర్మూలనకు అవసరమైన వైద్య, సామాజిక నైపుణ్యాన్ని బోర్డు టీబీ పార్ట్‌నర్‌షిప్ బోర్డు అందిస్తుంది. భారత్లో 2025 నాటికి క్షయ వ్యాధిని తరిమికొట్టాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేసేందుకు
Published date : 18 Mar 2021 06:05PM