స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణాలు
Sakshi Education
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మెరిపించారు.
70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్... 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవి... పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అమిత్ పంగల్ పసిడి పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో మంజు రాణి రజతం నెగ్గగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. గతంలో మహిళల విభాగంలో భారత్ తరఫున మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది. ఫిబ్రవరి 19న జరిగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జిల్లా అమ్మాయి నిఖత్ జరీన్ 5-0తో ఐరీష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... మీనా కుమారి 3-2తో ఐరా విలెగాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గగా... మంజు రాణి 2-3తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది. మరో టైటిల్ పోరులో అమిత్ పంగల్ 3-2తో తెమిర్‌తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఐరీష్ మాగ్నోతో జరిగిన తుది పోరులో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. నిఖత్‌ను నిలువరించడానికి ఐరీష్ మాగ్నో రక్షణాత్మకంగా ఆడినా ఫలితం లేకపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు మూడు బంగారు పతకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 19న
ఎవరు : నిఖత్ జరీన్, మీనా కుమారి దేవి, అమిత్ పంగల్
ఎక్కడ : సోఫియా (బల్గేరియా)
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు మూడు బంగారు పతకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 19న
ఎవరు : నిఖత్ జరీన్, మీనా కుమారి దేవి, అమిత్ పంగల్
ఎక్కడ : సోఫియా (బల్గేరియా)
Published date : 20 Feb 2019 05:53PM