సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్(స్మార్ట్) పథకం ఉద్దేశం?
Sakshi Education
రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ ‘‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్ (స్మార్ట్)’’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది.
రైలు టెర్మినళ్ల వద్ద గూడ్‌స షెడ్లను ఎంచుకుని సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్‌స షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో...
ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్... ఐదు చోట్ల గూడ్‌స షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్‌స షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. 2020 ఏడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్ (స్మార్ట్) పేరుతో నూతన పథకం రూపకల్పన
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : రైల్వే శాఖ
ఎందుకు : దేశంలోని రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు

Published date : 28 Jan 2021 05:56PM