Skip to main content

సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక

సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది.
Current Affairsఈ నివేదికను కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయడుకి అందజేశారు. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు-2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమై తాజా నివేదికను రూపొందించింది. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ బిల్లులో పలు మార్పులను సూచించింది.

సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సూచనలు
  • సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చు.
  • 35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చు.
  • సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధన సడలింపు.
  • అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలి.
  • బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుంది.
  • భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలి.
Published date : 06 Feb 2020 06:00PM

Photo Stories