సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Sakshi Education
కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు రూపొందించిన ‘సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019’కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.
మూజువాణి ఓటు ద్వారా ఆగస్టు 5న బిల్లు పాసైంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చట్టబద్ధమైన సరోగసీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
బిల్లులోని ముఖ్యాంశాలు..
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు
బిల్లులోని ముఖ్యాంశాలు..
- చట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండిన భారతీయ దంపతులు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు అర్హులు.
- సరోగసీ ద్వారా పిల్లలను పొందాలనుకునే దంపతులు తమ సమీప బంధువులు ద్వారా మాత్రమే పిల్లలను కనాలి.
- నిస్వార్థ సేవల ద్వారా బంధువుల సాయం తీసుకోవాలి.
- సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డను.. సదరు బిడ్డ తల్లిదండ్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019కి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు
Published date : 06 Aug 2019 05:22PM