సరళ్ ర్యాంకులలో కర్ణాటకకు అగ్రస్థానం
Sakshi Education
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆగస్టు 21న విడుదల చేసిన స్టేట్ రూఫ్‌టాప్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ (సరళ్) ర్యాంకులలో కర్ణాటక రాష్ట్రం 78.8 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ర్యాంకులలో 72.2 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, 66.1 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం దక్కించుకుంది. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రాలకున్న అవకాశాలను మదించి ఈ ర్యాంకులను రూపొందించారు.
సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి వినియోగదారుల అనుభవం విషయంలో తెలంగాణ అగ్రస్థానం సాధించిందని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ రూఫ్‌టాప్ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ (సరళ్) ర్యాంకులలో అగ్రస్థానం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కర్ణాటక

Published date : 22 Aug 2019 05:39PM