Skip to main content

శ్రీలంకలో నూతన రైల్వేలైన్ ప్రారంభం

శ్రీలంకలో హంబన్‌తోట రాష్ట్రంలోని మటారా-బెలియత్త మధ్య నిర్మించిన నూతన రైల్వే మార్గాన్ని ఏప్రిల్ 9న శ్రీలంక ప్రభుత్వం ప్రారంభించింది.
దీంతో 1948లో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభించిన తొలి రైల్వేలైన్‌గా ఇది నిలిచింది. 26.75 కి.మీ పొడువున్న ఈ రైల్వేలైన్‌ను చైనా సహకారంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఎగ్జిమ్ బ్యాంకు ఆర్థిక సహకారం అందించగా నేషనల్ మెషినరీ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రాజెక్టును నిర్మించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంకలో నూతన రైల్వేలైన్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
Published date : 10 Apr 2019 04:35PM

Photo Stories