శ్రీలంక పేలుళ్లలో 253 మంది మృతి
Sakshi Education
శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన పేలుళ్ల కారణంగా 253 మంది మర ణించారని ఏప్రిల్ 25న ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పేలుళ్లలో ఏప్రిల్ 24నాటికి 359 మంది మరణించారని తొలుత శ్రీలంక ప్రకటించింది. అయితే దానిని తాజాగా 253కి సవరించింది. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సూచన మేరకు ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర తమ పదవులకు రాజీనామా చేశారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడులకు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక పేలుళ్లలో 253 మంది మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక పేలుళ్లలో 253 మంది మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
Published date : 27 Apr 2019 05:45PM