శ్రీలంక ఎన్నికల్లో రాజపక్స పార్టీ విజయం
Sakshi Education
శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహిందరాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది.
రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ మూడింటరెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద 4వసారి ప్రధాన మంత్రిగా ఆగస్టు 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. మాజీ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : శ్రీలంక పీపుల్స్ పార్టీ(మహిందరాజపక్స పార్టీ)
Published date : 08 Aug 2020 08:11PM