Skip to main content

శ్రీలంక అధ్యక్షుడితో మోదీ చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు జరిపారు.
శ్రీలంక రాజధాని కొలంబోలో జూన్ 9న జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చించారు. ఉగ్రవాదంతో భారత్, శ్రీలంక ఉభయ దేశాలకూ ముప్పు ఏర్పడిందని మోదీ అన్నారు. దీనిని ఉమ్మడిగా ఎదుర్కోవలసి ఉందని పిలుపునిచ్చారు. భేటీ సందర్భంగా మోదీకి ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం ప్రతిని సిరిసేన బహూకరించారు.

ఏప్రిల్ 21న ఈస్టర్ పర్వదినం సందర్భంగా చర్చిలపై ఉగ్రవాదుల దాడులు జరిగిన అనంతరం శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ నేత మోదీనే. పర్యటనలో భాగంగా ఉగ్రవాదుల దాడికి గురయిన సెయింట్ ఆంథోనీ చర్చిని సందర్శించిన మోదీ బాధితులకు నివాళులు అర్పించారు. ఏప్రిల్‌లో తౌహీద్ జమాత్ అనే ఉగ్ర సంస్థ జరిపిన దాడుల్లో వందలాది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో చర్చలు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొలంబో, శ్రీలంక
Published date : 10 Jun 2019 06:09PM

Photo Stories