Skip to main content

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరాకై ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ?

కోవిడ్-19ను అరికట్టడానికి రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది.
Current Affairs
అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. 2020 ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ సెప్టెంబర్ 16న ప్రకటించింది.

హ్యూమన్ ఎడినోవైరస్ ప్లాట్‌ఫాంపై...
రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు. రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని వ్యాఖ్యానించారు.

చదవండి: మార్కెట్లోకి విడుదలైన తొలి కరోనా వ్యాక్సిన్?

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
ఎందుకు : స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై
Published date : 17 Sep 2020 04:40PM

Photo Stories