Skip to main content

సోషల్‌ మీడియాలో కోవిడ్‌ అధికారిక సమాచారం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Current Affairs
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 11న‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేస్తూ.. ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏర్పాట్లు చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్ష
కోవిడ్‌–19 వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏప్రిల్ 12న‌ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు, ఖైనీ వంటి ఉత్పత్తులు నమిలి ఉమ్మివేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సోషల్‌ మీడియాలో కోవిడ్‌ అధికారిక సమాచారం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు
Published date : 13 Apr 2020 06:14PM

Photo Stories