Skip to main content

సోషల్‌ మీడియా నిబంధనావళిని కేంద్రం ఏ పేరుతో విడుదల చేసింది?

సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Current Affairs
తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. సోషల్‌ మీడియా, ఓటీటీ, డిజిటల్‌ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌’’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫిబ్రవరి 25న వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకొచ్చారు.
  • సోషల్‌ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది.
  • ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ
  • వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి.
  • వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్‌ మీడియా సంస్థలు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను, కేబుల్‌ టెలీవిజన్‌ నెట్‌వర్క్స్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
  • భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ పేరుతో నిబంధనావళి విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు
Published date : 26 Feb 2021 06:20PM

Photo Stories