Skip to main content

సంస్కరణల అజెండా అమల్లో పీఎన్‌బీ అగ్రస్థానం

సంస్కరల అజెండాను సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మేరకు బీసీజీ-ఐబీఏ రూపొందించిన ఈజ్ (ఎన్‌హాన్స్ డ్ యాక్సెస్, సర్వీస్ ఎక్సలెన్స్) సూచీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28న విడుదల చేశారు. డిజిటలైజేషన్, రుణ వితరణ సహా 6 విభాగాల్లో 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ సూచీలో 100 పాయింట్లకు గాను పీఎన్‌బీ 78.4 పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీఓబీ (77.8 పాయింట్లు), ఎస్‌బీఐ (74.6 పాయింట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69 పాయింట్లు), కెనరా బ్యాంకు (67.5 పాయింట్లు), సిండికేట్ బ్యాంక్ (67.1 పాయింట్లు) నిలిచాయి.

సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ-ఐబీఏ ఈజ్ సూచీని రూపొందించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సంస్కరణల అజెండా అమల్లో పీఎన్‌బీ అగ్రస్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : బీసీజీ-ఐబీఏ
Published date : 01 Mar 2019 05:50PM

Photo Stories