సంగీత దర్శకుడు ఖయ్యాం కన్నుమూత
Sakshi Education
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, పద్మభూషణ్ గ్రహీత మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93) కన్నుమూశారు.
కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో ఆగస్టు 19న ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 17 ఏళ్లకే సంగీత ప్రయాణం ప్రారంభించిన ఖయ్యాం ఉమ్రావ్ జాన్, కభీకభీ వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఉమ్రావ్ జాన్ సినిమాకు అందించిన సంగీతానికిగాను జాతీయ అవార్డు లభించింది. 2007లో సంగీత నాటక అకాడమి అవార్డును ఖయ్యాం అందుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం)తో
Published date : 20 Aug 2019 05:15PM