సముద్రపు నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనం
Sakshi Education
సముద్ర జలాల నుంచి చౌకగా హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు.
కాలుష్యం లేని, సమర్థమైన ఇంధనంగా హైడ్రోజన్‌కు పేరున్న సంగతి తెలిసిందే. నిల్వ, రవాణాల్లో సమస్యలున్న నేపథ్యంలో ఆ వాయువు విసృ్తత వాడకం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే పరికరాన్ని తయారు చేశారు. వేడి, విద్యుత్తు, సూర్యరశ్మి వంటి వాటి అవసరమేమీ లేకుండా, పర్యావరణ హితమైన పదార్థంతోనే ఇదంతా జరుగతూండటం విశేషమని శాస్త్రవేత్త మాలెక్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వినూత్నమైన పరికరం అభివృద్ధి
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు
ఎందుకు : సముద్ర జలాల నుంచి చౌకగా హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : వినూత్నమైన పరికరం అభివృద్ధి
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు
ఎందుకు : సముద్ర జలాల నుంచి చౌకగా హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు
మాదిరి ప్రశ్నలు
1. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఏ నది తీరాన విస్తరించి ఉంది?
1. యమున
2. గోమతి
3. గంగా
4. సట్లేజ్
- View Answer
- సమాధానం: 3
2. జంతు శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1. ఎంటమాలజీ
2. న్యూమరాలజీ
3. పేలియోజువాలజీ
4. పేలినాలజీ
- View Answer
- సమాధానం: 3
Published date : 17 Jan 2020 06:11PM