Skip to main content

సముద్ర ప్రాంతాల సర్వేకు రోబో బోటును రూపొందించిన ఐఐటీ?

దేశానికి సంబంధించిన వేలాది కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని సులువుగా సర్వే చేసేందుకు సరికొత్త రోబో బోటును ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
Current Affairs దేశ సముద్ర సంబంధ రంగంలో స్వావలంబన సాధించే దిశగా రూపొందించిన ఈ రోబో బోటు పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సముద్ర ప్రాంతాలతోపాటు నదీజలాల్లోనూ స్వతంత్రంగా సర్వే చేయడం, గస్తీ కాసేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇప్పటికే చెన్నై సమీపంలోని కామరాజర్ నౌకాశ్రయంలో ఈ బోటును పరీక్షించారు. 2021 ఏడాదిలో ఇది కార్యకలాపాలు సాగించగలదని అంచనా.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సరికొత్త రోబో బోటు రూపకల్పన
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ఐఐటీ మద్రాస్
ఎందుకు : సముద్ర తీర ప్రాంతాన్ని సులువుగా సర్వే చేసేందుకు
Published date : 24 Nov 2020 06:30PM

Photo Stories