సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష
Sakshi Education
తెలంగాణలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూమ్‌లను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష విధించింది.
అలాగే ముగ్గురికి కలిపి రూ.26 వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2019, నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయమూర్తి విచారణ జరిపారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న ప్రత్యే కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని జనవరి 30న తుది తీర్పు వెలువరించారు.
Published date : 31 Jan 2020 05:37PM