స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ?
Sakshi Education
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ)... ‘స్మైల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు స్మైల్ కార్యక్రమం ద్వారా ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. కరోనాతో మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ?
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు...
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్‌ను ముందుకు తీసుకొచ్చింది.
కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు స్మైల్ కార్యక్రమం ద్వారా ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. కరోనాతో మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ?
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు...
Published date : 25 Jun 2021 06:23PM