Skip to main content

స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

అత్యాధునిక ఆయుధం... స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యు)ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) జనవరి 21న విజయవంతంగా పరీక్షించింది.
Current Affairs

ఒడిశా తీరంలోహెచ్‌ఏఎల్‌కు చెందిన యుద్ధ విమానం హాక్-ఐ నుంచి ఈ ఆయుధాన్ని పరీక్షించారు. విశ్రాంత వింగ్ కమాండర్లు పి.అవస్థి, ఎం.పటేల్ హాక్-ఐ ఎయిర్‌క్రాఫ్ట్ పెలైట్లుగా వ్యవహరించారు. డీఆర్‌డీఓకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) ఈ ఆయుధాన్ని తయారు చేసింది.

ఎస్‌ఏఏడబ్ల్యు-ముఖ్యాంశాలు

  • 125 కిలోల బరువున్న ఎస్‌ఏఏడబ్ల్యుతో శత్రు సైన్యాల బలగాలను వంద కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యంగా చేసుకోవచ్చు.
  • రాడార్లు, బంకర్లు, ట్యాక్సీ ట్రాక్‌లు, రన్‌వేలను ఇది సులువుగా నాశనం చేస్తుంది.
  • ఈ పరీక్ష విజయవంతం కావడంతో హాక్‌ఐ యుద్ధ విమానాలను మరింత ఆధునీకరించవచ్చు.
  • ఇండియన్ హాక్ ఎంకే132 విమానం నుంచి పరీక్షించిన తొలి స్మార్ట్ ఆయుధం ఇదే.
  • ఎస్‌ఏఏడబ్ల్యును బంకర్లు, టాంకర్లను ధ్వంసం చేయడానికి ఫైర్ చేస్తారు. దీని రేంజ్ 100 కిలోమీటర్లు.
  • గతంలో ఈ ఆయుధాన్ని జాగ్వార్ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యు) పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)
ఎక్కడ : ఒడిశా తీరం
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా...
Published date : 23 Jan 2021 03:36PM

Photo Stories