Skip to main content

స్మాల్‌ బిజినెస్‌ లోన్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?

చిన్న, మధ్యతరహా బిజినెస్‌(ఎస్‌ఎంబీ)లకు రుణాలందించేందుకు వీలుగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ‘స్మాల్‌ బిజినెస్‌ లోన్స్‌ కార్యక్రమాన్ని’ ప్రారంభించింది.
స్వతంత్ర రుణదాతల ద్వారా త్వరితగతిన రుణాలను పొందవచ్చంటూ ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాన్ని తొలిసారి ఫేస్‌బుక్‌ దేశీయంగా ఆవిష్కరించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్‌ఎంఈలు)కు మరింత సులభంగా వ్యాపార రుణాలు లభించేందుకు ఈ కార్యక్రమం దోహదపడగలదని ఫేస్‌బుక్‌ ఇండియా ఆగస్టు 20న తెలిపింది. ఇందుకు వీలుగా ప్రస్తుతం ఇండిఫీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇతర రుణదాతలతోనూ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఫేస్‌బుక్‌ ద్వారా ఇండిఫీ.... 17–20 శాతం మధ్య వడ్డీ రేట్లతో రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ రుణాలను అందించనున్నట్లు వెల్లడించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : స్మాల్‌ బిజినెస్‌ లోన్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఫేస్‌బుక్‌ ఇండియా
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : చిన్న, మధ్యతరహా బిజినెస్‌(ఎస్‌ఎంబీ)లకు రుణాలందించేందుకు వీలుగా...
Published date : 21 Aug 2021 06:01PM

Photo Stories