సమాచార ప్రసారంలో సరికొత్త రికార్డు
Sakshi Education
ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడంలో శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రత్యేకమైన సోలిషన్ స్ఫటికాల సాయంతో తాము సమాచారాన్ని 75 కిలోమీటర్ల దూరానికి అత్యధిక వేగంతో పంపగలిగామని కెనడాలోని ఇన్‌స్టిట్యూట్ నేషనల్డీ లా రీచెరిచే సైంటిఫిక్ అధ్యాపకుడు రొబెర్టో మోరాన్‌డోటీ తెలిపారు.
ఈ క్రమంలో సమాచార లోపాలు చాలా తక్కువగానూ నమోదయ్యాయని తెలిపారు.
సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా ప్రసారం చేసేందుకు శాస్త్రవేత్తలు వేర్వేరు తరంగదైర్ఘ్యాలను వాడుతుంటారని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న నెట్‌వర్క్‌లలో ఒక్కో తరంగదైర్ఘ్యానికి ప్రత్యేకమైన లేజర్ అవసరమవుతుందని రొబెర్టో తెలిపారు. ఈ లేజర్ల కారణంగా సమాచార ప్రసారం అనేది వ్యయ ప్రయాసలతో కూడినది అవుతోందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము ప్రత్యేకమైన చిప్ ద్వారా వేర్వేరు తరంగదైర్ఘ్యాలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సమాచార ప్రసారంలో సరికొత్త రికార్డు
ఎప్పుడు : మే 25
ఎవరు : ఇన్‌స్టిట్యూట్ నేషనల్ డీ లా రీచెరిచే సైంటిఫిక్
ఎందుకు : సమాచార ప్రసారంలో అధిక వ్యయం సమస్యను అధిగమించేందుకు

Published date : 26 May 2020 06:24PM