స్క్వాష్ టోర్నీ నుంచి వైదొలగిన భారత్
Sakshi Education
మహిళల ప్రపంచ టీమ్ స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి భారత్ వైదొలగింది. ఈ విషయాన్ని భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) కార్యదర్శి సైరస్ పొంచా ఆగస్టు 3న వెల్లడించారు.
షెడ్యూలు ప్రకారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో 2020, డిసెంబర్ 15 నుంచి 20 వరకు ఈ చాంపియన్ షిప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల తమ ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్ లేదని... దాంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతుండటం, ప్లేయర్ల ఆరోగ్య భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వైదొలగినట్లు పొంచా తెలిపారు. మరోవైపు చైనా వేదికగా 2020, జూన్ లో జరగాల్సిన ఆసియా జూనియర్ చాంపియషిప్‌ను ఆసియా స్క్వాష్ సమాఖ్య రద్దు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల ప్రపంచ టీమ్ స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి వైదొలగిన భారత్
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ)
ఎక్కడ :కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : కరోనా వైరస్ విజృంభణ కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల ప్రపంచ టీమ్ స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి వైదొలగిన భారత్
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ)
ఎక్కడ :కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : కరోనా వైరస్ విజృంభణ కారణంగా
Published date : 04 Aug 2020 05:43PM