Skip to main content

‘స్కోచ్’ అవార్డుల రేసులో తెలంగాణ పోలీసు

సాక్షి, హైదరాబాద్: భారతీయులకు మెరుగైన సేవలందించిన ప్రజలు, వ్యవస్థలు, సంస్థలకు ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలకు తెలంగాణ పోలీసు శాఖ నామినేట్ అయింది.
Current Affairsఅయితే ఈ అవార్డుల కోసం ఓటింగ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ఓటింగ్ ఆధారంగా విజేతలకు అవార్డులు అందజేస్తారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్ కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా సేవలందించినందుకు తెలంగాణ పోలీసు శాఖ ఈ అవార్డు రేసులో చోటు దక్కించుకుంది. తెలంగాణ డీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఈ లింక్‌ని క్లిక్ చేసి ఓటు వేయాలని పోలీసు శాఖ సూచించింది.
Published date : 27 Oct 2020 05:37PM

Photo Stories