స్కాటిష్ ఓపెన్ చాలెంజ్ విజేత లక్ష్యసేన్
Sakshi Education
స్కాటిష్ ఓపెన్ సూపర్-100 ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారత యువ షట్లర్ లక్ష్యసేన్ నిలిచాడు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నవంబర్ 24న జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్ 18-21, 21-18, 21-19తో యోర్ కోహెల్‌హో (బ్రెజిల్)పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
తొలి గేమ్ ఓడినా... తర్వాతి రెండు గేమ్‌లను సొంతం చేసుకున్న లక్ష్యసేన్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు.
గతంలో ఈ టైటిల్‌ను ఇండియా ప్రస్తుత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ (1999), అరవింద్ భట్ (2004), ఆనంద్ పవార్ (2010) మాత్రమే సాధించారు. తాజాగా ఈ జాబితాలో లక్ష్యసేన్ చోటు దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సార్లార్‌లక్స్ ఓపెన్, డచ్ ఓపెన్, బెల్జియన్ ఇంటర్నేషనల్ టోర్నీలను లక్ష్యసేన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కాటిష్ ఓపెన్ సూపర్-100 ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : భారత యువ షట్లర్ లక్ష్యసేన్
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్లాండ్

Published date : 25 Nov 2019 05:58PM