Skip to main content

శిశు మరణాలపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక పేరు?

ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు అనే అంశంపై ‘చైల్డ్ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్‌‌స 2020’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను విడుదల చేసింది.
Current Affairs

1990-2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని ఈ నివేదికలో ఐరాస పేర్కొది.

ఐరాస నివేదికలోని ప్రధానాంశాలు...

  • భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది.
  • భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయి్య మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది.
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి.
  • అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి.
  • సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్‌‌స 2020 పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల వివరాలపై
Published date : 10 Sep 2020 05:10PM

Photo Stories