Skip to main content

షిప్పింగ్ శాఖ పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ

కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది.
Current Affairsఈ మేరకు నవంబర్ 11న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.‘‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నాం. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాలి. నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించిన విషయం తెలిసిందే.

వీజీఎఫ్ పథక విస్తరణ...
సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ నవంబర్ 11న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ పథకం అమలవుతోంది.
Published date : 12 Nov 2020 05:41PM

Photo Stories