సిన్సినాటి ఓపెన్ విజేతగా మెద్వెదేవ్
Sakshi Education
ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యాకి చెందిన డానిల్ మెద్వెదేవ్ విజేతగా నిలిచాడు.
అమెరికాలోని సిన్సినాటిలో ఆగస్టు 19న జరిగిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ మెద్వెదేవ్ 7-6 (7/3), 6-4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికాకి చెందిన మాడిసన్ కీస్ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో 16వ సీడ్ మాడిసన్ కీస్ 7-5, 7-6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.విజేతలుగా నిలిచిన మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్ విజేతలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : డానిల్ మెద్వెదేవ్, మాడిసన్ కీస్
ఎక్కడ : సిన్సినాటి, అమెరికా

Published date : 20 Aug 2019 05:02PM